Share News

సిట్‌ కస్టడీకి వాసుదేవరెడ్డి

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:54 AM

మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని రెండు రోజుల పాటు సిట్‌ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సిట్‌ కస్టడీకి వాసుదేవరెడ్డి

  • 2రోజుల పాటు అనుమతించిన ఏసీబీ కోర్టు

విజయవాడ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని రెండు రోజుల పాటు సిట్‌ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాసుదేవరెడ్డిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాద ప్రతివాదనలు ముగియడంతో మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 5, 6 తేదీల్లో కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Mar 04 , 2026 | 03:55 AM