ముగిసిన వాసుదేవరెడ్డి కస్టడీ
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:25 AM
మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కస్టడీ శుక్రవారంతో ముగిసిం ది. విచారణ అనంతరం ఆయన ను విజయవాడ ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.
విజయవాడ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కస్టడీ శుక్రవారంతో ముగిసిం ది. విచారణ అనంతరం ఆయన ను విజయవాడ ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. వైద్యపరీక్షలు పూర్తయిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు కొట్టారా అ ని న్యాయాధికారి భాస్కరరావు ఆయనను ప్రశ్నించారు. తనను ఎవరూ కొట్టలేదని, విచారణలో అడిగే ప్రశ్నావళిని అడిగితే ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కాగా, వాసుదేవరెడ్డి ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయడానికి సిట్ అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను కోర్టు పదో తేదీకి వాయిదా వేసింది.