Share News

ఘనంగా వాసవీ మాత జయంతి

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:35 PM

వాసవీ మాత జయంతిని అమ్మవారి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

 ఘనంగా వాసవీ మాత జయంతి
హొళగుందలో అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

అమ్మవారి చిత్రపటాల ఊరేగింపు

పత్తికొండ/మద్దికెర/హొళగుంద/వెల్దుర్తి/టౌన/ఆలూరు/రూరల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): వాసవీ మాత జయంతిని అమ్మవారి ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం వేకువ జాము నుంచీ అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామావళి పారాణం, సామూహిక కుంకుమార్చనలు, మహిళలకు ఒడిబియ్యం పోయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

పత్తికొండలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

మద్దికెర నగరేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు స్థానిక మద్దమ్మ బావికి వెళ్లి గంగ పూజ చేశారు. కలశాలతో గంగను తీసుకొచ్చి వాసవీ మాత కు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

హొళగుందలో ఆర్యవైశ్య మహిళలు బస్టాండులోని పురాతన బావి వద్ద గంగపూజ చేశారు. వాసవీమాత ఆలయం వరకు అమ్మవారి చిత్రపటాన్ని, కలశ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫ వెల్దుర్తిలో స్థానిక కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లో వాసవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, పుష్పాలంకరణ, మహా మంగళహారతి ఇ చ్చారు. స్థానిక పాతబస్టాండులో ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

ఆలూరులో వాసవీ కల్యాణ మండపంలో అమ్మవారికి పూజలు చేశారు. పట్టణానికి చెందిన రవికుమారు శెట్టి, జనార్దనశెట్టి అమ్మవారికి వెండి కవచాన్ని విరాళం గా అందించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాగ మ్మ దేవాలయం నుంచి వాసవీ కన్యకా పర మేశ్వరి దేవాలయం వరకు వాసవీమాత నామస్మరణతో శోభాయాత్ర నిర్వహించారు.

Updated Date - Apr 26 , 2026 | 11:35 PM