రంగనాథస్వామి ఆలయంలో వరుణ యాగం
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:44 PM
మం డలంలోని పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో పురోహితుల ఆధ్వర్యంలో వరుణయాగం చేశారు.
మద్దికెర, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని పెరవలి రంగనాథ స్వామి ఆలయంలో పురోహితుల ఆధ్వర్యంలో వరుణయాగం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మూలవిరాట్ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేదపండితుల ఆధ్వర్యంలో వరుణయాగం చేపట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన తుగ్గలి నాగేంద్ర పాల్గొన్నారు. వర్షాలు కురిసి మంచి పంటలు పండి రైతులు సురక్షితంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వీరయ్య, టీడీపీ నాయకులు ప్రముఖ విరాళాదాత పారా విశ్వనాథ్ అలియాస్ చిట్టెన్న, మాజీ జడ్పీటీసీ పురుషోత్తం చౌదరి, నాయకులు గూడూరు ధనుంజయుడు, ఎన.లక్ష్మీనారాయణ, మెడికల్ తిమ్మప్ప, రామాంజనేయులు, పులిశేఖర్ పాల్గొన్నారు.