గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల, దళవాయి
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:45 AM
గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యులుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి నియామకానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతిస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
గెజిట్ జారీ... ప్రమాణస్వీకారం చేసిన రామయ్య
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యులుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి నియామకానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతిస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బుధవారం నోటిఫికేషన్ వెలువడగానే వర్ల రామయ్య ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. దళవాయి రమాదేవి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం వర్ల, అసెంబ్లీలోని లోకేశ్ చాంబర్‌కి వెళ్లి ఆయన్ను కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వర్ల రామయ్యతో చైర్మన్ మోషేన్‌రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణం చేసిన వర్ల... సభా గౌరవాన్ని కాపాడతానని, సభా సంప్రదాయాలను కొనసాగిస్తానని చెప్పారు. ఆతర్వాత సభ గురువారానికి వాయిదా పడింది.