కాపులను రెచ్చగొట్టేందుకే సాయికృష్ణ కేసుపై జగన్ మొసలి కన్నీరు: వర్ల రామయ్య
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:51 AM
కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ, కాపులను రాజకీయంగా మభ్యపెడుతూ జగన్ తన అసలు నైజాన్ని చాటుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ, కాపులను రాజకీయంగా మభ్యపెడుతూ జగన్ తన అసలు నైజాన్ని చాటుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ‘సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో జగన్ మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉంది. కాపు కులాన్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని సాయికృష్ణ తల్లిని కలసి కాపులను రెచ్చగొడుతున్నారు. సాయికృష్ణ చనిపోయాడంటూ తప్పడు ఫొటోలను సాక్షి పత్రికలో చూపించి అబద్ధాలు ప్రచారం చేయడం వెనుక కుట్ర దాగుంది. తన అక్కను అవమానించారంటూ వైసీపీ నేతలను నిలదీసిన 14 ఏళ్ల అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోలు పోసి తగలబెడితే జగన్ ఎందుకు వెళ్లలేదు?’ అని వర్ల ప్రశ్నించారు.