Share News

సరుకు రవాణాలో మేటి ‘వజ్రబాహు’: డీఆర్‌ఎం

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:28 AM

శక్తివంతమైన సరుకు రవాణా లోకోమోటివ్‌ డబ్ల్యూఏజీ-9హెచ్‌సీ ‘వజ్రబాహు’ గుంతకల్లు డివిజన్‌లో అందుబాటులోకి వచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా బుధవారం దీన్ని ప్రారంభించారు.

 సరుకు రవాణాలో మేటి ‘వజ్రబాహు’: డీఆర్‌ఎం

గుంతకల్లు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): శక్తివంతమైన సరుకు రవాణా లోకోమోటివ్‌ డబ్ల్యూఏజీ-9హెచ్‌సీ ‘వజ్రబాహు’ గుంతకల్లు డివిజన్‌లో అందుబాటులోకి వచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా బుధవారం దీన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గుంతకల్లులోని ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌లో 200వ లోకోమోటివ్‌గా వజ్రబాహును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 200 ఇంజన్లను నిర్వహించడం ఈ షెడ్‌ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. వజ్రబాహు 6 వేల హార్స్‌ పవర్‌తో గూడ్సు ర్యాక్‌లను గంటకు 100 నుంచి 120 కి.మీ. వేగంతో లాగగలదని తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 07:30 AM