Share News

అజాతశత్రువు వాజపేయి: మాధవ్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:02 AM

మాజీ ప్రధాని వాజపేయి అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కొనియాడారు.

అజాతశత్రువు వాజపేయి: మాధవ్‌

  • పార్వతీపురంలో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ

పార్వతీపురం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని వాజపేయి అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కొనియాడారు. పార్వతీపురంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి శుక్రవారం వాజపేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ దేశంలో కాంగ్రేసేతర పార్టీలను ఒకే గూటికి తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత వాజపేయికే దక్కిందన్నారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో ఎన్టీఆర్‌, వాజపేయి కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

Updated Date - Jan 10 , 2026 | 05:03 AM