AP Govt: ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:40 AM
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు కూటమి ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును నియమిస్తూ...
కమిషనర్లుగా మరో నలుగురి నియామకం
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు కూటమి ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు (విశాఖపట్నం), వొంటేరు రవిబాబు (కడప), గాజుల ఆదెన్న (అనంతపురం), వీఎ్‌సకే చక్రవర్తి (మంగళగిరి)ని సమాచార హక్కు చట్టం- 2005 ప్రకారం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్లు నిండే వరకూ వీరు పదవిలో కొనసాగుతారు. చీఫ్ కమిషనర్‌గా నియమితులైన వజ్జా శ్రీనివాసరావు గుంటూరు జిల్లాలో 1968 మే 2న జన్మించారు. 1995లో నాగపూర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. హైకోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు వాదించడంలో మంచి పేరు గడించారు. ప్రభుత్వం తరపున రెవెన్యూ కేసులు వాదించిన శ్రీనివాసరావు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.