Tirumala: నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:32 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠద్వార దర్శనాలు గురువారంతో ముగియనున్నాయి.
తిరుమల, జనవరి7(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైకుంఠద్వార దర్శనాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం అర్థరాత్రి వైదిక కార్యక్రమాల తర్వాత వైకుంఠద్వారాలను మూసివేస్తారు. తిరిగి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు తెరుస్తారు. గడిచిన ఎనిమిది రోజుల్లో 6.24 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం లభించింది. రూ.32.17 కోట్లు హుండీ ఆదాయం లభించింది. బుధవారం భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టింది.