11న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు: మంత్రి సవిత
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:55 AM
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలను వ్యతిరేకంగా పోరాడిన...
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలను వ్యతిరేకంగా పోరాడిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఓబన్న జయంతిని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అనంతపురం పట్టణంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.