పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్చండి
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:01 AM
బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేసే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) తల్లిదండ్రులకు కోరింది.
తల్లిదండ్రులకు యూటీఎఫ్ పిలుపు
అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేసే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) తల్లిదండ్రులకు కోరింది. యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. జయాపజయాలను ఒకేలా చూసే దృఢ సంకల్పాన్ని నేర్పించేది ప్రభుత్వ పాఠశాలలేనన్నారు.