UTF State Council Meetings: 10, 11 తేదీల్లో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:44 AM
ఊరి బడిని కాపాడుకుందాం’’ అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు...
గుంటూరు (విద్య), జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ఊరి బడిని కాపాడుకుందాం’’ అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో యూటీఎఫ్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు వెల్లడించారు. గురువారం గుంటూరు యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బడిలో బోధించే ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఎలాంటి బోధనేతర కార్యక్రమాలు ఉండకూడదనే నినాదంతో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాల ఆవరణలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, 32 సంవత్సరాల తర్వాత యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభలు గుంటూరులో జరుగుతున్నాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 18 నెలలు పూర్తికావస్తున్నా 12వ పీఆర్సీ చైర్మన్‌ను ఇంతవరకు నియమించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.