Guntur: యూటీఎఫ్ నూతన కార్యవర్గం
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:25 AM
రెండు రోజులుగా గుంటూరులో జరుగుతున్న యూటీఎఫ్ రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి.
గుంటూరు (విద్య) జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా గుంటూరులో జరుగుతున్న యూటీఎఫ్ రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నక్కా. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కెఎ్‌సఎస్ ప్రసాద్, గౌరవాధ్యక్షుడిగా కే. శ్రీనివాస్ రావు, సహాధ్యక్షులుగా కే.సురేష్ కుమార్, ఏఎన్ కుసుమకుమారి, కోశాధికారిగా ఆర్. మోహన్ రావు తోపాటు 25 మంది ఆఫీస్ బేరర్లను, 120 మంది కార్యవర్గ సభ్యులను, ఆడిట్ కమిటీ, ఐక్య ఉపాధ్యాయ పత్రిక, ప్రచురణల విభాగం చైర్మన్, సంక్షేమ సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.