Share News

పట్టణాల్లో ‘పశు సంవర్ధకానికి’ రాయితీలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:53 AM

రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో డెయిరీ, గొర్రెలు/మేకల పెంపకం, పందుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాలకు...

పట్టణాల్లో ‘పశు సంవర్ధకానికి’ రాయితీలు

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో డెయిరీ, గొర్రెలు/మేకల పెంపకం, పందుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాలకు అభివృద్ధి, బెటర్‌మెంట్‌ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు కల్పిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రంగాలను వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలుగా కాకుండా గ్రామీణ-పట్టణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా గుర్తించిన ప్రభుత్వం, రైతులు, చిన్న వ్యాపారులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పశు సంవర్ధక యూనిట్లకు సంబంధించిన బిల్డింగ్‌ లైసెన్స్‌, అనుమతి ఫీజులను గ్రామ పంచాయతీల స్థాయికి సమానంగా తగ్గించారు. ఈ చర్యతో వ్యాపార సౌలభ్యం పెరగడమే కాకుండా, పట్టణ పరిసర ప్రాంతాల్లో పశుసంవర్ధక యూనిట్ల ఏర్పాటు సులభమవుతుంది. ఈ విధానం ద్వారా ఉత్పాదకత పెరగడం, రైతుల ఆదాయం పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 04:53 AM