పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:01 AM
పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు.
ఆదోని, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యతనివ్వాలని ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం పట్టణ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రోడ్డు పనుల వేగవంతం, వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో మున్సిపల్ యంత్రాంగం చురుగ్గా పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు.
ఎమ్మెల్యేను కలిసిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ కమిటీ చైర్మన్
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి.వి.పార్థసారథిని ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ టీజీ పాండురంగశెట్టి అమర్యాదపూర్వకంగా కలిశారు. ప ట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతుల కల్పన వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బీజే పీ సీనియర్ నేత విట్టా రమేష్, దేవస్థాన కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.