రబీలో తగ్గిన యూరియా వినియోగం
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో గత మూడేళ్ల రబీ సీజన్లలో యూరియా సగటు వినియోగం 513 కిలోల నుంచి 338 కిలోలకు తగ్గిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు.
హెక్టారుకు 175 కిలోల ఆదా: అగ్రి డైరెక్టర్
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత మూడేళ్ల రబీ సీజన్లలో యూరియా సగటు వినియోగం 513 కిలోల నుంచి 338 కిలోలకు తగ్గిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు. తద్వారా 34శాతం తగ్గుదలతో ప్రతి హెక్టారుకు 175 కిలోల యూరియా ఆదా అయ్యిందన్నారు. 2025-26 రబీలో పంటల సాగు విస్తీర్ణం 36శాతం పెరిగినా.. యూరియా వినియోగం 3శాతమే పెరిగిందన్నారు. 2025లో 18,563 ఎరువుల నమూనాలు సేకరించగా, 413 నమూనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, 84మంది ఎరువుల లైసెన్సులను సస్పెండ్ చేయగా, 34 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.