సివిల్స్ విజేత హర్షితకు ‘స్వారీ’ స్వాగతం
ABN , Publish Date - May 05 , 2026 | 04:36 AM
సివిల్స్ విజేతతో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసు అధికారులు గుర్రపుబండిపై ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి): సివిల్స్ విజేతతో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసు అధికారులు గుర్రపుబండిపై ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయవాడలో ట్రాఫిక్-3 ఇన్‌స్పెక్టర్ మేదర సుధాకర్ కుమార్తె హర్షిత సివిల్స్‌లో 520వ ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో సుధాకర్ కుమార్తె విజయంపై ఆయన సహచరులు సంబరాలు చేశారు. హర్షితతోపాటు తండ్రి సుధాకర్, తల్లి చంద్రలీలను గుర్రపు బండిపై వీధుల్లో ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.