ఎన్టీఆర్‌లో అకాల వర్షానికి నేల వాలిన పంటలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:39 AM
అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గత మూడు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు తో డు శనివారం నందిగామ ప్రాంతంలో కురిసిన వర్షం పంటలకు తీవ్ర నష్టం చేసింది.
విజయవాడ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గత మూడు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు తో డు శనివారం నందిగామ ప్రాంతంలో కురిసిన వర్షం పంటలకు తీవ్ర నష్టం చేసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలుపంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి దాళ్వా వరి పూర్తిగా రాలి నేలపాలైం ది. మిర్చి, కూరగాయ పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొదట పడిన వర్షానికి నేలకొరిగి కోతకు సిద్ధమైన మొక్కజొన్నను అలానే ఉంచి కండెలు కోసి ఇళ్లకు చేర్చుకోవాలని రైతు లు భావించారు. శనివారం నాటి వర్షానికి పంట పూర్తిగా తడిసిపోయింది. మొక్కజొన్న కంకులు పూర్తిగా నీటిలోనే ఉండడంతో అవి కుళ్లిపోయి రంగు మారే అవకాశం కనిపిస్తుంది..