ప్రమాదస్థలికి ఉక్కు మంత్రి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:38 AM
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి హుటాహుటిన బయలుదేరి సోమవారం రాత్రి 11 గంటకు స్టీల్ ప్లాంటుకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు.
రూ. కోట్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా
నేడు విశాఖకు పవన్ కల్యాణ్, లోకేశ్
గాజువాక, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి హుటాహుటిన బయలుదేరి సోమవారం రాత్రి 11 గంటకు స్టీల్ ప్లాంటుకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం విశాఖ వస్తున్నారు. కాగా, ప్రమాద నష్టం కోట్ల రూపాయల్లో ఉండొచ్చునని స్టీల్ ప్లాంట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో క్రేన్ ఒకటి కాలిపోవడం...ఎస్ఎంఎస్-1 ప్రాంగణం చాలావరకు అగ్నికీలల్లో చిక్కుకోవడం.. వంటి అంశాల ఆధారంగా నష్టం తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్పత్తిని పూర్తిగా ఆపేయకుండా బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి డౌన్ చేశారని ఉద్యోగవర్గాలు తెలిపాయి.