మోదీ, షాతో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ భేటీ
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:06 AM
కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జన్మదిన వేడుకలు మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జన్మదిన వేడుకలు మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉదయం ప్రధాని మోదీ వద్దకు శ్రీనివాసవర్మ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. మోదీ.. ఆయన్ను ఆప్యాయంగా పలకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ప్రధానికి వర్మ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హోంమంత్రి అమిత్ షాను కలిసి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుకున్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్వయంగా శ్రీనివాస వర్మ నివాసానికి విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల్లో పాల్గొన్నారు.