వరదలొస్తే ఏం చేద్దాం.. రాష్ట్రాలకు జలశక్తి లేఖ
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:04 AM
దేశీయంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు మందగిస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా..
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): దేశీయంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు మందగిస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా.. క్యుమిలోనింబస్ మేఘాల కారణంగా ఆకస్మికంగా కుంభవృష్టి కురిస్తే వరదలను తట్టుకోవడంపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందని రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు రాష్ట్రాల జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చారు. వరదల సమయంలో అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలను రూపొందిద్దామని సూచించారు. వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని కాంతారావు వెల్లడించారు.