ఉద్యోగాల వయోపరిమితి పెంచాలి: నిరుద్యోగ జేఏసీ
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:55 AM
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు.
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలనలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వనందున అనేకమంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో గరిష్ఠ వయోపరిమితి 46ఏళ్లుగా ఉందని, ఏపీలోనూ 46ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.