Share News

ఏకగ్రీవాలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:52 PM

నంద్యాల జిల్లాలోని ఆరు మున్సి పాలిటీల్లో ఆళ్లగడ్డ, ఆత్మకూరులు టీడీపీ కైవసం అయ్యాయి.

   ఏకగ్రీవాలు
గెలుపొందినట్లు డిక్లరేషన అందుకుంటున్న డాక్టర్‌ గోవిందరాజులు

నంద్యాల జిల్లాలో రెండు మున్సిపాలిటీలు టీడీపీ కైవసం

ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్‌పర్సనగా షేక్‌ అనీషా

ఆత్మకూరు చైర్మనగా గోవిందరాజు

ప్రకటించిన ఎన్నికల అధికారులు

చర్చలతో వార్డులను పంచుకున్న రాజకీయ పార్టీలు

టీడీపీ శ్రేణుల్లో వెల్లివిరిసిన ఆనందం

నంద్యాల జిల్లాలోని ఆరు మున్సి పాలిటీల్లో ఆళ్లగడ్డ, ఆత్మకూరులు టీడీపీ కైవసం అయ్యాయి. ఇదేవిషయాన్ని ఆయా పురపాలికల ఎన్నికల అధికారులు సైతం ప్రకటిం చారు. ఆళ్లగడ్డలో మున్సిపల్‌ చైర్‌పర్సనగా షేక్‌ అనీషా, ఆత్మకూరులో మున్సిపల్‌ చైర్మనగా గోవిందరాజులు ఎన్నికయ్యారు. రెండు మున్సిపాలిటీలు టీడీపీకి దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక మిగిలిన నంద్యాల, డోన, నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో పురపోరు రసవత్తరంగా సాగనుంది.

ఆళ్లగడ్డ/ ఆత్మకూరు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పురపోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారిపోయింది. నంద్యాల జిల్లాలో రెండు మున్సిపాలిటీలు టీడీపీకి దక్కాయి. బుధవారం చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా విజయకేతనం ఎగురవేసింది. ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్‌ పర్సనగా అనీషా, ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మనగా గోవిందరాజులు ఎన్నికయ్యారు. మున్సిపల్‌ స్థానాలు ఏకగ్రీవాలు కావడంతో పోలీసు అధికారులతో పాటు ఎన్నికల అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. కాగా రెండు స్థానాలు టీడీపీ కైవసం కావడంతో తెలుగుతమ్ముళ్లలో ఆనందం వెల్లివిరిసింది. నంద్యాల, డోన, నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఏవిధంగా సాగుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అనీషాన

ఫ ఆళ్లగడ్డ మున్సిపాలిటీపై టీడీపీ జెండా

ఆళ్లగడ్డ మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. కూటమి బలపరిచిన అభ్యర్థి షేక్‌ అనీషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ మేజర్‌ గ్రామ పంచాయతీ 2012లో మున్సిపాలిటీగా మారింది. 2014లో తొలిసారి పురపాలక చైర్మన స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. వైసీపీ అభ్యర్థి ఉషారాణి చైర్‌పర్సనగా గెలిచారు. 2019లో ఓసీ జరరల్‌కు కేటాయించడంతో తిరిగి వైసీపీ అభ్యర్తి రాంలింగారెడ్డి ఛైర్మెన గా గెలుపొందారు. 2026లో బీసీలకు పెద్ద పీట వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం బీసీ మహిళకు చైర్‌పర్సన పదవిని కేటాయించారు. టీడీపీ తరుపున షేక్‌ అనీషా చైర్‌పర్సనగా ఏకగ్రీవం కావడం విశేషం. మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో తెలుగు దేశం పార్టీ 22 స్ధానాలు, జనసేన 2, వైసీపీకి 8వార్డులు మాత్రమే దక్కాయి. ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్‌పర్సనగా అనీషా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కిషోర్‌ ప్రకచించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన ఏర్పాటుకు పైనుంచి అనుమతి రావాలని ఆయన వివరించారు.

గోవిందరాజు అయ్యారు

ఫ మున్సిపల్‌ వైస్‌ చైర్మన వైసీపీకి అవకాశం?

ఆత్మకూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మున్సి పాలిటీ చైర్మన పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. బుధవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా వైసీపీ తరుపున పోటీ చేసిన డాక్టర్‌ ప్రియాంకబాయితో పాటు ఆమె తల్లి శారద బాయి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీడీపీ తరుపున పోటీచేసిన డాక్టర్‌ గోవిందరాజులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు ఆయనకు డిక్లరేషన పత్రాన్ని అందజేశారు. వార్డు స్థానాలను సైతం పలు రాజకీయ పార్టీలు చర్చలతో ఏకగ్రీవాలు చేసుకున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులుండగా అందులో టీడీపీ 18, వైసీపీ 11, బీజేపీ 1, జనసేన 1 చొప్పున సర్దుబాబు చేసుకుని ఏకగ్రీవాలు చేసుకున్నట్లు సమాచారం. టీడీపీ, కూటమి ఒప్పందం ప్రకారం 20వ వార్డుకు మాత్రం ఎలాంటి నామినేషన్లు లేకపోవడంతో ఆ వార్డును మళ్లీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిసింది. ఈవార్డులో వైసీపీ చైర్మన అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ ప్రియాంకబాయిని బరిలో నిలిపి ఆమె సైతం ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత ఆమెకు వైస్‌ చైర్మనగా అవకాశం కల్పించేలా కూటమి, వైసీపీలు భావి స్తున్నట్లు తెలిసింది.

ఉత్కంఠగా సాగిన ఉపసంహరణ

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన నామినేషన్ల ఉపసంహణ ప్రక్రియ ఉదయం నుంచి ఉత్కంఠగా సాగింది. ఉద యం 10గంటలకు టీడీపీ శ్రేణులు భారీగా మున్సిపల్‌ కార్యాల యానికి చేరుకున్నారు. కాసేపు కూటమి అభ్యర్థులు మినహా ఇతర అభ్యర్థులు ఎవరు బి-ఫారాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారు. వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు ఏ ఒక్క అభ్యర్థి కూడా బి-ఫారాలు ఇవ్వలేకపోయారు. చివరికి జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి చొరవతో ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ఏకగ్రీవాలకు దారితీసినట్లు తెలిసింది. శాంతిభద్రతలకు విభాగం తలెత్తకుండా ఓపోలీసు ఉన్నతాధికారి సైతం ఏకగ్రీవాల విషయంలో జోక్యం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మ కూరు మున్సిపల్‌ చైర్మన పీఠం టీడీపీకి దక్కింది. మున్సిపల్‌ చైర్మనతో సహా అన్ని వార్డులు ఏకగ్రీవాలు కావడంతో పోలీసులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.

వార్డుల సర్దుబాటులో సతమతం..

మున్సిపల్‌ చైర్మన ఏకగ్రీవ ఎన్నిక సజావుగా సాగినప్పటికీ వార్డుల ఏకగ్రీవాల విషయంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు సతమతానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 60:40 నిష్పత్తిలో వార్డులను పంచుకోవాలని కూటమి, వైసీపీలు నిర్ణయించుకు న్నాయి. దీని ప్రకారం తొలుత తమకు అనుకూలమైన 13 వా ర్డులను కావాలని వైసీపీ కోరింది. దీనిపై టీడీపీ అభ్యంతరాలు తెలిపి రాత్రి వరకు చర్చలు జరిగాయి. చివరకు టీడీపీ 18, వైసీపీ 11, బీజేపీ 1, జనసేన 1 చొప్పున వార్డులను ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఒక్కవార్డుకు తిరిగి ఎన్నిక జరిపి వైసీపీ చైర్మన అభ్య ర్థికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వార్డుల సర్దుబా టుతో ఆయా పార్టీల్లో చాలా మంది అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. బీజేపీ, జనసేనకు తొలుత రెండు చొప్పున స్థానా లను కేటాయించినప్పటికీ సర్దుబాటుతో ఒక్కో స్థానానికే పరిమి తమయ్యారు. పట్టణంలోని 21వ వార్డును తొలుత జనసేన అభ్యర్థి పురం హరీష్‌కు కేటాయించినప్పటికీ చివరి సమయంలో సర్ధుబాటు వల్ల ఆ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి విజయ్‌చౌదరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా సర్ధుబాటు వ్యవహరంలో చివరి సమయంలో కూడా పలు స్థానాలు తారుమారయ్యాయి.

Updated Date - Oct 21 , 2026 | 11:52 PM