Share News

అమ్మో బాంబు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:45 AM

అది మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ఆవరణం. అక్కడే 13 అనుబంధ న్యాయస్థానాలు ఉన్నాయి. సోమవారం కావడంతో న్యాయవాదులు, కక్షిదారులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కోర్టు పనివేళలు ప్రారంభంకావడానికి సమయం ఆసన్నమవుతోంది. ఇంతలో సరిగ్గా 9.00 గంటలకు జిల్లా న్యాయమూర్తికి ఓ మెయిల్‌ వచ్చింది. ఆవరణలో బాంబు ఉందని దాని సారాంశం. వెంటనే స్పందించిన జిల్లా న్యాయమూర్తి గోపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే కోర్టుల ఆవరణలో ఎవరూ ఉండవద్దని బాంబు బెదిరింపు గురించి అనౌన్స చేయించారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన వ్యాయవాదులు, కక్షిదారులు అమ్మో బాంబు అంటూ బయటకు పరుగులుతీశారు.

 అమ్మో బాంబు!

- జిల్లా కోర్టులో ఆవరణలో బాంబు ఉందని మెయిల్‌

- ఎస్పీకి ఫిర్యాదు చేసిన జిల్లా న్యాయమూర్తి గోపీ

- కోర్టుహాలు నుంచి బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు

- పోలీస్‌ జాగిలాలు, డిటెక్టర్లతో ముమ్మరంగా తనిఖీలు

- కక్షిదారులు లోనికిరాకుండా గేటు మూసివేత

- 13 కోర్టుల్లో ఆగిపోయిన బెంచ్‌లు

- వాయిదాపడిన కేసులు

అది మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ఆవరణం. అక్కడే 13 అనుబంధ న్యాయస్థానాలు ఉన్నాయి. సోమవారం కావడంతో న్యాయవాదులు, కక్షిదారులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కోర్టు పనివేళలు ప్రారంభంకావడానికి సమయం ఆసన్నమవుతోంది. ఇంతలో సరిగ్గా 9.00 గంటలకు జిల్లా న్యాయమూర్తికి ఓ మెయిల్‌ వచ్చింది. ఆవరణలో బాంబు ఉందని దాని సారాంశం. వెంటనే స్పందించిన జిల్లా న్యాయమూర్తి గోపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే కోర్టుల ఆవరణలో ఎవరూ ఉండవద్దని బాంబు బెదిరింపు గురించి అనౌన్స చేయించారు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన వ్యాయవాదులు, కక్షిదారులు అమ్మో బాంబు అంటూ బయటకు పరుగులుతీశారు.

మచిలీపట్నం టౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

మచిలీపట్నం జిల్లా కోర్టులో సోమవారం బాంబు కలకలం రేపింది. కోర్టు విధులకు సిద్ధమవుతున్న సమయంలో జిల్లా న్యాయమూర్తికి ఉదయం 9.00 గంటలకు న్యాయస్థానాల్లో బాంబు ఉందని ఒక మెయిల్‌ వచ్చింది. గమనించిన జిల్లా జడ్జి గోపీ వెంటనే ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే కోర్టుల ఆవరణలో ఎవరూ ఉండవద్దని బాంబు బెదిరింపు గురించి అనౌన్స చేయించారు. దీంతో న్యాయవాదులు ఉరుకులు పరుగులతో బయటకు వచ్చేశారు. బాంబు ఎక్కడ ఉందోనన్న భయం సర్వత్రా వ్యాపించింది. ఇంతలో చిలకలపూడి సీఐ నబితో పాటు పలువురు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్‌ జాగిలాలతో న్యాయస్థానాల్లో ప్రతి అంగుళాన్ని జల్లెడపట్టారు. జాగిలాలు, లైడిటెక్టర్లతో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇలా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ముమ్మరంగా గాలించారు. అనంతరం బాంబులు ఎక్కడా లేవని ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బాంబు కలకలం నేపథ్యంలో కేసుల విచారణ జరగలేదు. న్యాయవాదులు క్యాంటీన్లకు పరిమితమైపోయారు. వందలాది కేసులు వాయిదాలు పడ్డాయి. కక్షిదారులెవరినీ లోపలకు రానీయలేదు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోతురాజు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ కక్షిదారులెవరినీ లోపలకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 12:45 AM