ఉమ్మీద్ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:34 AM
కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉమ్మీద్ పోర్టల్‌లో సర్వే, లీజు, లిటిగేషన్, ఆడిట్ వంటి నూతన మాడ్యూల్స్‌ను ప్రవేశపెట్టిందని...
ఒకే వేదికపైకి సమగ్ర సమాచారం: వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉమ్మీద్ పోర్టల్‌లో సర్వే, లీజు, లిటిగేషన్, ఆడిట్ వంటి నూతన మాడ్యూల్స్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. తద్వారా వక్ఫ్ ఆస్తుల సమగ్ర సమాచారం ఒకే వేదికపై అందుబాటులోకి వస్తుందని వివరించారు. దీనివల్ల పారదర్శకత పెరగడం, అక్రమాలు తగ్గడంతో వక్ఫ్ ఆస్తుల రక్షణ బలోపేతమవుతుందని తెలిపారు. మొదటి సర్వేలో గుర్తించిన 81 వేల ఎకరాల వక్ఫ్ భూమిని 100 శాతం డిజిటలైజ్ చేశామని, ప్రస్తుతం రెండవ సర్వే ఆస్తుల డిజిటలైజేషన్ 50 శాతానికి పైగా పూర్తైందని వివరించారు.