శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:09 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తిరుమల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనుల స్వామికి విశేష సమర్పణ చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్ర్తాలను అలంకరించి పంచాంగ శ్రవణాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు.