ఉద్దానంలో తాగునీటి పథకం పూర్తి: మనోహర్
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:37 AM
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగునీటి పథకం పూర్తయ్యిందని, దీనికి రూ.4,162.95కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తాగునీటి పథకం పూర్తయ్యిందని, దీనికి రూ.4,162.95కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. జలజీవన్ మిషన్ పథకంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి పవన్‌కల్యాణ్ తరుపున మనోహర్ సమాధానం చెప్పారు. గ్రంథాలయాల రుసుము వసూళ్లపై టీచర్ ఎమ్మెల్సీ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఇంటి పన్నుపై ప్రతి రూపాయికి 8పైసలు పంచాయతీలు వసూలు చేస్తుండగా, ఈ నిధుల్ని జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేసి, గ్రంథాలయాల నిర్వహణకు వినియోగిస్తున్నట్లు తెలిపారు.