రెండు జోన్లు.. ఐదు సబ్ డివిజన్లు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:27 PM
ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న కర్నూలు జిల్లా ఇక కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) పర్యవేక్షణలోకి మారనుంది.
కర్నూలు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు
సీపీగా ఐజీపీ/డీఐజీ హోదా అధికారి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కర్నూలు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ పర్యవేక్షణలో ఉన్న కర్నూలు జిల్లా ఇక కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) పర్యవేక్షణలోకి మారనుంది. కార్యనిర్వహణ మేజిసే్ట్రట్ అధికారంలో ఐజీపీ/డీఐజీపీ హోదా కలిగిన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కర్నూలు పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చూస్తూ సోమవారం ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.199 జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత జారీ చేశారు. గత నెలలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కర్నూలు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ప్రభుత్వం అధకారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు ఎస్పీ పర్యవేక్షణలో పని చేసిన పోలీస్ వ్యవస్థ ఇక సీపీ నేతృత్వంలో శాంతిభద్రతలు పర్యవేక్షణ చూడాల్సి ఉంటుంది. రెవెన్యూ జిల్లా. పోలీస్ జిల్లా సమానంగా ఉంటుంది. అలాగే.. జిల్లాలో లా అండ్ ఆర్డర్ రెండు జోన్లు, కర్నూలు అర్బన, రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజనలతో కమిషనరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఫ అధికారులు - అధికారాలు
-----------------------
ఫ కర్నూలు కమిషనరేట్ ఏర్పాటు చేయడం వల్ల ఐజీపీ/డీఐజీపీ స్థాయి హోదా కలిగిన అధికారి కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) నేతృత్వంలో పోలీస్ వ్యవస్థ చేస్తుంది.
ఫ లా అండ్ ఆర్డర్ జోన్లకు ఎస్పీ క్యాడర్ అధికారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ), సబ్ డివిజన్లకు డీఎస్పీలు, ఎస్పీ కంటే తక్కువ హోదా కలిగిన అధికారిని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)లు వస్తారు.
ఫ శాంతి భద్రతల పర్యవేక్షణలో ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ అధికారుల అర్యవేక్షణ కీలకంగా మారుతుంది.
ఫ లాండ్ అండ్ ఆర్డర్ జోన-1కు ఎస్పీ హోదా కలిగిన సౌత కోస్టల్ సెక్యూరిటీ పోస్టును డీసీపీ కో-ఆర్డినేషనగా కర్నూలు కమిషనరేట్‌కు బదిలీ చేయనున్నారు.
ఫ లాండ్ అండ్ ఆర్డర్ జోన-1కు ఎస్పీ హోదా కలిగిన ఈగల్ జిల్లా ఎస్పీ పోస్టును డీసీపీ-2గా బదిలీ చేయనున్నారు.
ఫ అడిషనల్ ఎస్పీ (ఆపరేషన -చిత్తూరు) పోస్టును కర్నూలు కమిషనరేట్ అడిషినల్ డీసీపీ (పరిపాలన)గా బదిలీ చేస్తారు
ఫ ప్రస్తుతం ఉన్న నాన కేడర్ ఎస్పీ (ఏఆర్) పోస్టు, కమాండెంట్, హోమ్ గార్డ్స్‌గా ప్రస్తుతం ఉన్న అదనపు ఎస్పీ (ఏఆర్)ను డీసీపీ (ఏఆర్), డీఎస్సీ (ఏఆర్)గా ఉన్న పోస్టును ఏసీపీ (ఏఆర్)గా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఫ కర్నూలు అర్బన, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ల డీఎస్పీలను ఏసీపీగా పేరు మార్పు చేశారు. ఏపీపీఏ డీఎస్పీ పోస్టును కర్నూలు రూరల్ సబ్ డివిజన ఏసీపీగా బదిలీ చేశారు.