ఓఆర్‌ఆర్‌పై కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
ABN , Publish Date - May 11 , 2026 | 05:07 AM
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఇద్దరు యూట్యూబర్ల దుర్మరణం
ఆదిభట్ల, మే 10 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)పై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తు న్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యూ ట్యూబర్లుగా పనిచేస్తున్న కత్తి భరత్ (31), సాయి త్రిలోక్ (31) ఇద్దరు స్నేహితులు. రెండు రోజుల క్రితం వారు నెల్లూరు జిల్లాలోని తమ స్వగ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఓఆర్‌ఆర్‌పై బొంగులూరు గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కత్తి భరత్ కారును నడుపుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపారు.