ఇద్దరు పశువైద్యులకు జాతీయ అవార్డులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:52 AM
అత్యున్నత సేవలు అందించిన ఇద్దరు పశువైద్య అధికారులకు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి.
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): అత్యున్నత సేవలు అందించిన ఇద్దరు పశువైద్య అధికారులకు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. ఒంగోలు వెటర్నరీ పాలి క్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్, విశాఖపట్నంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న మాదిన ప్రసాదరావుకు ‘డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన్-2025’ అవార్డులు లభించాయి. సోమవారం విజయవాడలో వెటర్నరీ డైరెక్టర్ దామోదర్‌నాయుడు ఇద్దరికీ అవార్డుల సర్టిఫికెట్లను అందించి ఘనంగా సన్మానించారు.