Road Accident: పొగ మంచు దెబ్బకు పోయిన ప్రాణాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:55 AM
పొగమంచు ఇద్దరి యువకులను బలిగొంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎన్.రంగాపురానికి చెందిన....
ప్యాపిలి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పొగమంచు ఇద్దరి యువకులను బలిగొంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎన్.రంగాపురానికి చెందిన రాజశేఖర్(23), సురేంద్ర(27) ఉడుములపాడు దగ్గర ఉన్న ఓ పరిశ్రమలో సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 సమయంలో ద్విచక్ర వాహనంపై ఉడుములపాడుకు బయలు దేరారు. కాసేపటికే ఎదురుగా వస్తున్న ఆటో.. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తలకు బలమైన గాయలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సురేంద్రను డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సురేంద్ర కుమార్‌కు గాయాలయ్యాయి. సురేంద్రకు భార్య, కూతురు ఉన్నారు. రాజశేఖర్‌కు ఇంకా వివాహం కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటరామిరెడ్డి చెప్పారు.