కార్లు దగ్ధం
ABN , Publish Date - May 20 , 2026 | 06:25 AM
చెక్‌పోస్టు వద్ద ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: చెక్‌పోస్టు వద్ద ఉన్న లారీని ఒక కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో కడప నుంచి తిరుపతి వెళ్తున్న మరో కారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆగింది. ఆగిన కారులోంచి అనుహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ప్రమాదానికి గురైన కారుకు అంటుకున్నాయి. దాంతో రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలంలోని బాలపల్లె చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన కారులో ఉన్న డ్రైవర్ అందులో నుంచి దూకేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో లారీ వెనకభాగం పాక్షికంగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు.
- రైల్వేకోడూరు, ఆంధ్రజ్యోతి