చైన స్నాచింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:11 PM
పట్టణంలో గత నెల 30న సినీ ఫక్కీలో కారులో వచ్చి ఇంట్లో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లిపోయిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ఆరంభించారు.
35 గ్రాముల బంగారం చైన్, ఓ కారు స్వాధీనం
ఆలూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో గత నెల 30న సినీ ఫక్కీలో కారులో వచ్చి ఇంట్లో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లిపోయిన ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ఆరంభించారు. కారు నంబర్‌తో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ మన్మధవిజయ్, సిబ్బంది వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఉన్న కేసుల ఆధారంగా సాంకేతికతను ఉపయోగించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ ఈ కేసులో డోన్ మండలం తాడూర్‌కి చెందిన రౌడీషీటర్ జగన్‌మోహన్‌రెడ్డి, రుద్రవరం మండలం నందనపల్లికి చెందిన తిరుపతి సురేష్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారు చైన్‌తో పాటు అద్దెకు తీసుకున్న ఏపీ40సీఆర్ 3458 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఆలూరు ఎస్‌ఐ మన్మధవిజయ్‌ను కానిస్టేబుళ్లు వీరకేశవరెడ్డి, మల్లికార్జులను సీఐ అభినందించారు.