Share News

25 వేల అడుగుల జాతీయ జెండా

ABN , Publish Date - Jan 25 , 2026 | 05:40 AM

రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

25 వేల అడుగుల జాతీయ జెండా

రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పర్యాటక మంత్రి దుర్గేశ్‌ హాజరయ్యారు.వందేమాతరం స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్‌ యునైటెడ్‌ నెట్‌వర్క్‌ సంస్థ అధ్యక్షుడు బసవ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 25 వేల చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని వర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది.

- దివాన్‌చెరువు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 25 , 2026 | 05:41 AM