సొరంగాలు పూర్తి.. సిబ్బంది సంబరాలు
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:27 AM
నెల్లూరు జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు తుదిదశకు చేరాయి. భారతమాల పరియోజన రెండో దశలో భాగంగా విజయవాడ నుంచి బెంగళూరుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 518 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నారు
తుది దశలో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు
సీతారామపురం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు తుదిదశకు చేరాయి. భారతమాల పరియోజన రెండో దశలో భాగంగా విజయవాడ నుంచి బెంగళూరుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 518 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని సీతారామపురం మండలంలో 16 కిలోమీటర్ల మేర ఇది నిర్మితమవుతోంది.జిల్లా సరిహద్దు నుంచి వైఎస్సార్ కడప జిల్లా మధ్య సొరంగ మార్గాల పనులు పూర్తి కావస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిధిలో అతిపెద్ద సొరంగాలు కావడంతో వీటి పనులు ప్రతిష్ట్రాత్మకంగా చేస్తున్నారు. ఇటీవల కుడి, ఎడమ వైపు సొరంగాల పనులు పూర్తిచేశారు. కుడి, ఎడమవైపు మార్గాలు పూర్తి కావడంతో ఆదివారం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.