Share News

డీహైడ్రేషన్‌తోనే పెంపుడు కుక్క మృతి!

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:46 AM

చిన్నారి జ్ఞానేశ్వరి ఉదంతం ఇంకా మిస్టరీగానే ఉంది. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యమై..

డీహైడ్రేషన్‌తోనే పెంపుడు కుక్క మృతి!

  1. జ్ఞానేశ్వరి కేసు ఫోరెన్సిక్‌ రిపోర్టులో స్పష్టత

తుని రూరల్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): చిన్నారి జ్ఞానేశ్వరి ఉదంతం ఇంకా మిస్టరీగానే ఉంది. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారానికి చెందిన చిన్నారి అదృశ్యమై ఇరవై రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మరణంపై ఫోరెన్సిక్‌ నివేదికతో ఒక అంశంపై స్పష్టత వచ్చింది. డీహైడ్రేషన్‌ (తీవ్ర నీరసం) కారణంగానే కుక్క మృతి చెందినట్టు తేలినట్టు సమాచారం. కుక్క శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, విషప్రయోగ ఆనవాళ్లు కూడా లేవని నివేదిక స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు జ్ఞానేశ్వరి తల్లి భవాని మనోవేదనతో అనారోగ్యానికి గురయ్యారు.

Updated Date - Jun 27 , 2026 | 05:47 AM