Share News

తుంగభద్ర డ్యాం గేటు ఏర్పాటు విజయవంతం

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:30 PM

తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు టీబీపీ బోర్డు ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు.

తుంగభద్ర డ్యాం గేటు ఏర్పాటు విజయవంతం
: తుంగభద్ర డ్యాం 18వ నంబరు గేట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన టీబీపీ బోర్డు ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు

33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చే పనులకు శ్రీకారం

తొలి ప్రయంత్నంలో 18వ నంబరు గేటు బిగింపు

విజయవంతంగా ట్రైల్‌ రన పూర్తి

బోర్డు ఇంజనీర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

కర్నూలు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు టీబీపీ బోర్డు ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు. తొలి ప్రయత్నంలో తప్పు పట్టి పూర్తిగా దెబ్బతిన్న 18వ నంబరు గేటు ఏర్పాటును విజయవంగా పూర్తి చేసి ముందడుగు వేశారు. సోమవారం సాయంత్రం 5.30-6 గంటల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రైల్‌ రన విజయవంతమైంది. దీంతో బోర్డు ఇంజనీర్లను సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మరో మూడు గేట్లు సగం వరకు పూర్తి చేశారు. ఒక గేటు సక్సెస్‌ఫుల్‌గా అమర్చడంతో మే ఆఖరులోగా మొత్తం గేట్లు ఏర్పాటు చేస్తామనే ఆత్మవిశ్వాసం పెరిగిందని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ వివరించారు.

1953లో పూర్తయిన శ్రీశైలం ప్రాజెక్టుకు 6.50 లక్షల క్యూసెక్కులకు పైగా డిచ్చార్జ్‌ సామర్థ్యంతో 33 క్రస్ట్‌ గేట్లు ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో డ్యాం 19వ గేటు చైనలింక్‌ తెగిపోయి కొట్టుకుపోవడంతో డ్యాం, గేట్ల భద్రతపై పలు పశ్నలు తెలెత్తాయి. గేట్స్‌ ఎక్స్‌పర్ట్‌ కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఇంజనీర్లు రేయింబహుళ్లు శ్రమించి స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ ఏర్పాటు చేసి తుంగభద్ర జాలలు కడలిపాలు కాకుండా కాపాడారు. అయితే.. డ్యాం డిజైన ప్రకారం గేట్ల జీవితకాలం 45 ఏళ్లు కాగా.. 70 ఏళ్లు ఏ ఇబ్బంది లేకుండా పని చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎస్‌ఏ), సీడబ్ల్యూసీ మాజీ చైర్మన ఏకే బజాజ్‌ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. వారి సిఫార్సుల మేరకు కేఎస్‌ఎనడీటీ సర్వీసెస్‌ సంస్థ ద్వారా గేట్లు సామర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్‌, డీపీటీ వంటి పరీక్షలు చేయించారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు 33 క్రస్ట్‌గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటుకు రూ.44 కోట్లతో బోర్డు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ పనులను టెండరు ద్వారా గుజరాతకు చెందిన ‘హార్డ్‌వేర్‌ టూల్స్‌’ సంస్థకు అప్పగించారు.

ఫ విజయవంతంగా ఒక గేటు ఏర్పాటు:

కాంట్రాక్ట్‌ సంస్థ క్రస్ట్‌గేట్ల గేట్ల తయారి (ఫ్యాబ్రికేషన) పనులు గతేడాది నుంచి డ్యాం సమీపంలో, గదగ్‌ దగ్గర రెండు ప్రాంతాల్లో చేపట్టింది. డిసెంబరు 6న బోర్డు సెక్రెటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, బోర్డు కర్ణాటక సభ్యుడు కృష్ణమూర్తి కులకర్ణి సహా ఏపీ, కర్ణాటక రైతులతో కలసి ప్రత్యేక పూజలు చేసి నూతన గేట్ల అమర్చే పనులు చేపట్టారు. 18వ నంబరు గేటు మొదటు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టారు. డ్యాం సైట్‌లో గేట్ల ఏర్పాటు కోసం 48 మంది కార్మికులు, సాంకేతిక సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. 35 రోజుల్లో 18వ నంబరు పాత గేటును పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో కొత్త గేటు బిగించారు. 60 అడుగులు వెడల్పు, 20 అడుగుల ఎత్తు, 49.5 టన్నుల బరువు ఉందని ఇంజనీర్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో బోర్డు సెక్రెటరీ ఓఆర్‌కే రెడ్డి, సీఈ లక్ష్మానాయక్‌, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, ఈఈ చంద్రశేఖర్‌, డ్యాం డీఈఈ జ్ఞానేశ్వర్‌ సహా డ్యాం, క్వాలిటీ కాంట్రోల్‌ ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థ సాంకేతిక సిబ్బంది ట్రైల్‌ రన నిర్వహించారు. 20 అడుగులు గేటును పైకి ఎత్తిదించారు. ఏ చిన్న శబ్దం, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రైల్‌రన విజయవంతమైంది. మరో మూడు గేట్లు బిగించే పనులు సగం వరకు పూర్తి చేశారు.

Updated Date - Jan 12 , 2026 | 11:30 PM