25న తుంగభద్ర క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:01 AM
తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్లను ఈ నెల 25న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
హాజరుకానున్న కేంద్ర మంత్రి పాటిల్, ముగ్గురు సీఎంలు
బళ్లారి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్లను ఈ నెల 25న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారని బోర్డు సెక్రెటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణనాయక్ మంగళవారం తెలిపారు. డ్యాంకు మొత్తం 33 గేట్లను మార్చారు.