కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మనగా తుగ్గలి నాగేంద్ర
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:25 PM
ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మనగా తుగ్గలి నాగేంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఽధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది.
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పత్తికొండ, జనవరి 7 (ఆంఽధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మనగా తుగ్గలి నాగేంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఽధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలానికి చెందిన తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయులుగా పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా తుగ్గలి నాగేంద్ర పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన భార్య వరలక్ష్మి టీడీపీ తరపున 2014లో తుగ్గలి జడ్పీటీసీగా గెలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం రోజుల్లో కాంగ్రె్‌సకు కంచుకోటగాఉన్న పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలికి చెందిన కుమ్మరి సుంకన్న మొదటి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు దీటుగా నిలిచారు. ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు 1989లో సుంకన్నను దారుణంగా హత్యచేశారు. కుమ్మరి సుంకన్న హత్య సమయంలో కడపలో న్యాయశాస్త్రం చదువుతున్న తుగ్గలి నాగేంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1990లో తుగ్గలిమండల టీడీపీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుండి ఇప్పటివరకు 36 ఏళ్లరాజకీయప్రస్థానంలో టీడీపీ జిల్లాకార్యదర్శిగా, టీడీపీ జిల్లాప్రె్‌స కమిటీ చైర్మనగా, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, టీడీపీ రాష్ట్రకార్యదర్శిగా పనిచేశారు. 2016లో టీడీపీ హయాంలో ఆయన శాలివాహ కార్పొరేషన చైర్మనగా పనిచేశారు. తుగ్గలిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు సొంత స్థలాలను కేటాయించారు. పేదలకు ఉచిత వివాహాలు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. 12 ఎకరాల్లో ఆయన 600మందికి పైగా నిరుపేదలకు ఇంటి స్థలాలను రిజిసే్ట్రషన చేయించారు.
ఎమ్మెల్సీ ఆశించి...
టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తుగ్గలి నాగేంద్ర సేవలను పార్టీగుర్తిండంతోపాటు మంచిపదవులు అందిస్తూ ప్రోత్సహించింది. ఎన్నడూ అసెంబ్లీ గడప తొక్కని కులాలను కూడా గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తామని ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీంతో కుమ్మరిశాలివాహన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న తుగ్గలి నాగేంద్ర ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆ తర్వాత శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన పదవిని కూడా ఆశించారు. అయితే ఆ పదవి కూటమిలో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితులు కూడా లేవు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మనగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీఆదేశాలు గౌరవించడమే తెలుసు
- తుగ్గలినాగేంద్ర
తెలుగుదేశం ఆవిర్భావంలో నియోజకవర్గంలో మొదటిసభ్యత్వం తీసుకున్న కుటుంబంగా నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది. మానాన్న హత్య తరువాత రాజకీయాల్లోకి వచ్చిననేను ఆరోజు నుంచి ఈరోజు వరకు టీడీపీ అబివృద్ధికి పనిచేస్తూ పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిర్వహించాను. పదవిపై వ్యామోహం లేదు.. పార్టీ ఆదేశాల మేరకు ముందుకు సాగడమే నాకు తెలుసు. నాకు ఎప్పుడు ఎలాంటిపదవి ఇవ్వాలన్నది అధిష్ఠానం గుర్తిస్తుందని నమ్ముతాను. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నాయకత్వంలో నియోజకవర్గ అబివృద్ధికి అనునిత్యం కృషి చేస్తాను.