గ్యాస్ సరఫరా ఆపొద్దు.. ఐఓసీఎల్‌కు టీటీడీ విజ్ఞప్తి
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:05 AM
నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని ఐఓసీఎల్‌కు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుపతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని ఐఓసీఎల్‌కు టీటీడీ విజ్ఞప్తి చేసింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ వినియోగంపై కేంద్రం నియంత్రణల నేపథ్యంలో టీటీడీ అధికారుల్లో ఆందోళన మొదలైంది. గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్న ప్రసాదాల తయారీతో పాటు ఇతర అవసరాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశముందని ఐఓసీఎల్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, టీటీడీని ఆధ్యాత్మిక పరిధిలో ఉంచి సరఫరాను కొనసాగించాలని కోరినట్టు తెలిసింది. దీనికి ఐఓసీఎల్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు సమాచారం.