Share News

TTD: రేపు ఏప్రిల్‌ నెల ఆర్జిత సేవల కోటా విడుదల

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:51 AM

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల లక్కీడిప్‌ కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

TTD: రేపు ఏప్రిల్‌ నెల ఆర్జిత సేవల కోటా విడుదల

తిరుమల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్‌ నెల కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల లక్కీడిప్‌ కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు వీటి కోసం నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, వసంతోత్సవం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవాటికెట్లు విడుదల చేస్తారు. అలాగే 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మఽధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి టోకెన్లు అందుబాటులో ఉంచుతారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల చేస్తారు. 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారిసేవా, పరకామణిసేవా టోకెన్లు కూడా విడుదల చేయనున్నారు. వీటికోసం భక్తులు ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ లేదా, ‘టీటీదేవస్థానమ్స్‌’ అనే మొబైల్‌ యాప్‌ను వినియోగించవచ్చు.

Updated Date - Jan 18 , 2026 | 03:51 AM