Share News

18న సెప్టెంబరు నెల ఆర్జిత సేవల కోటా విడుదల

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:25 AM

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల సెప్టెంబరు నెల కోటాను ఈ నెల 18వ తేదీన టీటీడీ విడుదల చేయనుంది.

18న సెప్టెంబరు నెల ఆర్జిత సేవల కోటా విడుదల

తిరుమల, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల సెప్టెంబరు నెల కోటాను ఈ నెల 18వ తేదీన టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన లక్కీడిప్‌ కోటాను 18న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. 22న ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవలను, వాటి దర్శన టికెట్లను విడుదల చేయనుంది. 23న ఉదయం 10గంటలకు అంగప్రదక్షిణ, 11గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు వృద్ధులు, దివ్వాంగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి టోకెన్లు జారీ చేస్తుంది. ముఖ్యంగా 24వ తేదీన ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని ‘టీటీదేవస్థానమ్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jun 14 , 2026 | 05:27 AM