టీటీడీ ట్రస్టులకు రూ.1.70 కోట్ల విరాళాలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:15 AM
టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం రూ.1.70 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో.. ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి..
తిరుమల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం రూ.1.70 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో.. ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి.. మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరుపై ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన లియాన్ ఇన్ర్ఫా డెవలపర్స్ అధినేత కంది అశోక్ కుమార్ మరో రూ.10 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందజేశారు. దాతలు ఈ విరాళాల చెక్‌లను హైదరాబాద్‌లో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ రూ.40 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన భవేశ్ చౌదరి రూ.10 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పొనకల నాగేంద్ర రావు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షల విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం చెక్‌లను తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.