Share News

టీటీడీలో పెరుగుతున్న రద్దయిన నోట్ల నిల్వలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 06:05 AM

టీటీడీలో భక్తులు సమర్పిస్తున్న రద్దయిన నోట్ల నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.500, రూ.వెయ్యి నోట్లు దాదాపు రూ.400 కోట్లు టీటీడీ వద్దనే ఉన్నట్టు తెలుస్తోంది

టీటీడీలో పెరుగుతున్న రద్దయిన నోట్ల నిల్వలు

  • సుమారు 400 కోట్లున్నట్లు సమాచారం

తిరుమల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): టీటీడీలో భక్తులు సమర్పిస్తున్న రద్దయిన నోట్ల నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.500, రూ.వెయ్యి నోట్లు దాదాపు రూ.400 కోట్లు టీటీడీ వద్దనే ఉన్నట్టు తెలుస్తోంది. డీమానిటైజేషన్‌లో భాగంగా కేంద్రం ఈ నోట్లను రద్దు చేసినప్పటికీ స్వామివారి హుండీలో ఇవి కానుకలుగా వస్తూనే ఉన్నాయి. వీటి మార్పిడి కోసం టీటీడీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. స్వయంగా టీటీడీ చైర్మన్లు, అధికారులు ఎన్నోమార్లు వినతిపత్రాలు అందజేసినా సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. ఇక, రూ.2 వేల నోట్లు రద్దు చేసినప్పటికీ ప్రతి నెలా రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్లు హుండీ ద్వారా వస్తున్నాయి. అయితే వీటిని బ్యాంకుల సహకారంతో రెండు నెలలకోసారి టీటీడీ మార్పిడి చేసుకుంటోంది.

Updated Date - Apr 07 , 2026 | 06:06 AM