అలిపిరి నడక మార్గంలో వన్యప్రాణుల నియంత్రణ
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:16 AM
తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్య ప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు..
సమగ్ర కార్యాచరణకు టీటీడీ ఆదేశాలు
తిరుమల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్య ప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి అధికారులకు సూచించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలిపిరి నడక మార్గంలో కొన్నేళ్లుగా చోటు చేసుకున్న వన్య ప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీనివాసరెడ్డి, డీఎ్‌ఫవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.