శ్రీవారి ఆర్జితసేవల నవంబరు కోటా విడుదల రేపు
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:06 AM
తిరుమల శ్రీవారి ఆర్జితసేవల నవంబరు నెల కోటాను 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు..
తిరుమల, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవల నవంబరు నెల కోటాను 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఎలక్ర్టానిక్ డిప్ కోసం భక్తులు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ, పుష్పయాగం టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లు, 24వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మఽధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి టోకెన్లు జారీ చేస్తారు. అలాగే 25వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల్లో గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని ‘టీటీదేవస్థానమ్స్. ఏపీ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు.