లడ్డూ కల్తీపై ఈ నెలాఖరుకు నివేదిక
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:58 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన వన్ మ్యాన్ కమిటీ ఏప్రిల్ 30నాటికి నివేదిక ఇచ్చేవిధంగా...
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన వన్ మ్యాన్ కమిటీ ఏప్రిల్ 30నాటికి నివేదిక ఇచ్చేవిధంగా ప్రభుత్వం గడువు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ చేసిన విన్నపం మేరకు ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ ప్రభుత్వం పొడిగించింది.