రాములవారి కల్యాణోత్సవానికి రండి
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:02 AM
ఒంటిమిట్ట శ్రీరాములవారి కల్యాణోత్సవానికి రావాలంటూ టీటీడీ గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించింది.
గవర్నర్, సీఎంకు టీటీడీ ఆహ్వానం
తిరుమల, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట శ్రీరాములవారి కల్యాణోత్సవానికి రావాలంటూ టీటీడీ గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించింది. విజయవాడలోని గవర్నర్ బంగ్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను, ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శివప్రసాద్, అర్చక బృం దంతో కలిశారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల కల్యాణానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
