స్లాటెడ్ భక్తులకు నిర్దేశిత సమయంలోనే దర్శనం
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:40 AM
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు(ఎస్ఎస్‌డీ), రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు(ఎ్‌సఈడీ) కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతిస్తామని...
టీటీడీ
తిరుమల, మార్చి 10(ఆంధ్రజ్యోతి): స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు(ఎస్ఎస్‌డీ), రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు(ఎ్‌సఈడీ) కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది. ఈ నిబంధనలను సోమవారం నుంచి కఠినంగా అమలు చేస్తున్నామని, కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బందిపడొద్దని సూచింది. సమయాన్ని పాటించే తోటి భక్తులకు ఆటంకం కలిగించవద్దని కోరింది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకోవాలని, కేటాయించిన సమయానికే క్యూలైన్ వద్దకు చేరుకోవాలని కోరింది.